ప్చ్!... 50 సినిమాలు పూర్తయినా ఇప్పటికీ కొబ్బరికాయ సరిగా పగలగొట్టలేకపోతున్నా: సమంత
- వంటలు నేర్చుకుంటున్న సమంత
- కొబ్బరిపాల కోసం కొబ్బరికాయ పగలగొట్టిన వైనం
- సరిగా పగల్లేదంటూ విచారం
టాలీవుడ్ అందాలభామ సమంత లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉంటూ వంటలు నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా కొబ్బరిపాల కోసం ఓ కొబ్బరికాయ పగలగొట్టిన వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా సమంత వ్యాఖ్యానిస్తూ, ఇప్పటికీ తాను కొబ్బరికాయను సరిగా పగలగొట్టలేకపోతున్నానని వాపోయారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీసు చేస్తున్నా, ఒక్క కొబ్బరికాయ సరిగా పగలడంలేదని తెలిపారు. ఇప్పటివరకు తాను 50 సినిమాల్లో నటించానని, ఆ సినిమా ముహూర్తం కార్యక్రమాల్లో 50 కొబ్బరికాయలు పగలగొట్టానని, అయినా సరైన రీతిలో కొబ్బరికాయ పగలగొట్టడం ఎలాగో నేర్చుకోలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.