మరో దారుణం... గర్భిణిగా ఉన్న ఆవుకు పేలుడు పదార్థాలు పెట్టారు!
- ఉత్తరప్రదేశ్ బిలాస్ పూర్ జిల్లాలో దారుణం
- బాంబు కారణంగా పేలిన ఆవు దవడ
- పక్కింటి వ్యక్తే దీనికి కారణమని ఫిర్యాదు చేసిన ఆవు యజమాని
కొబ్బరికాయలో పేలుడు పదార్థాలను అమర్చి ఓ గర్భిణి ఏనుగును కేరళలో చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి మరో దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బిలాస్ పూర్ జిల్లా జాందుత్తలో ఓ గర్భిణి ఆవుకు పేలుడు పదార్థాలు పెట్టారు. దీనిపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు ఆవుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పొరుగింట్లో ఉంటున్న నందలాల్ అనే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించాడు. బాంబు పేలడం వల్ల ఆవు దవడ పగిలిపోయింది. ప్రస్తుతం తిండి కూడా తినలేని పరిస్థితిలో నరకాన్ని అనుభవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన రోజు నుంచి నందలాల్ కనిపించడం లేదు. దీంతో, అతనిపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి.