హీరోయిన్ తమన్నా పోస్ట్ చేసిన ఫొటో, ట్వీట్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్న నెటిజన్లు!
- అమెరికాలో నల్లజాతీయుడి మృతిపై ట్వీట్
- గతంలో ఓ యాడ్‌లో తెలుపురంగును ప్రమోట్ చేసిన తమన్నా
- ఇప్పుడు మరోలా మాట్లాడుతుందని విమర్శలు
- అప్పటి ఫొటోలు పోస్ట్ చేస్తోన్న నెటిజన్లు
హీరోయిన్ తమన్నా తాజాగా పోస్ట్ చేసిన ఫొటో, ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి శ్వేత జాతి పోలీసు కారణమైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తమన్నా స్పందిస్తూ తన ముఖానికి నలుపురంగు రాసుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.
'నీ మౌనం నిన్ను కాపాడదు. మనిషి అయినా జంతువైనా ప్రతి ఒక్కరి జీవితం ముఖ్యమే కదా? మనిషి మనిషిగా ప్రేమ, జాలి, కరుణతో జీవించడం మళ్లీ నేర్చుకోవాలి' అని ఆమె ట్వీట్ చేసింది. అయితే, ఇప్పుడు ఇలా మాట్లాడిన తమన్నా ఒకప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో మరోలా నటించడమే ఆమె తాజా ట్వీట్‌పై విమర్శలకు కారణమైంది.
ఆ క్రీమ్‌లో నటిస్తోన్న సందర్భంగా తెలుపు రంగును ప్రచారం చేసింది. అంటే, నల్లగా ఉన్న వారు అలాగే జీవితాంతం ఉండకుండా ఉండేందుకు ఆ క్రీమ్ రాసుకోవాలని చెబుతూ అప్పట్లో ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంది. అప్పటి వీడియోను, ఆమె ఫొటోలను పోస్ట్ చేస్తోన్న నెటిజన్లు 'నువ్వు నల్లజాతిపై అహంకారం వద్దని చెబుతున్నావా?' అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖం తెలుపు రంగులో ఉంటేనే బాగుంటుందంటూ ప్రచారం చేసిన ఆమె ఇప్పుడు మరోలా వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.