'3 నెలలుగా పని, ఆహారం లేవు కేటీఆర్ సర్' అంటూ వీడియో పోస్ట్ చేసిన యువకులు.. మంత్రి స్పందన
- మస్కట్‌లో ఉంటున్నామని చెప్పిన యువకులు
- స్పందించిన కేటీఆర్ కేంద్రమంత్రికి ట్వీట్
- వారిని భారత్ తీసుకురావాలని కోరిన కేటీఆర్
తనకు 3 నెలలుగా పని లేదని, ఆహారం అందట్లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే కార్మికుడు, పలువురు యువకులతో కలిసి ట్వీట్ చేశాడు. తాము మస్కట్‌లో రెండేళ్లుగా ఉంటున్నామని, అక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని చెప్పాడు. ఉపాధి కోసం మస్కట్ కు వెళ్లిన కార్మికుల కోసం హైదరాబాద్‌కు విమానాలను ఏర్పాటు చేయాలని కోరాడు.
నిత్యావసరాలు అందక అక్కడి భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపాడు. విమానాలు కేరళకే ఉన్నాయని, హైదరాబాద్‌కి ఒక్కటీ లేదని చెప్పాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఓ విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. వేతనాలు, నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.