మరో పురస్కారం దక్కించుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు
- విమానాశ్రయానికి పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారం
- పర్యావరణహితం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఎయిర్‌పోర్టు
- నీటి వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పసిఫిక్ గ్రీన్ ఎయిర్‌పోర్టు ప్లాటినం పురస్కారం లభించింది. పర్యావరణహిత చర్యలు తీసుకోవడంలో కృషి చేసిన విమానాశ్రయాలకు ప్రతి ఏడాది ఈ అంతర్జాతీయ పురస్కారం అందిస్తారు. ఏడాదికి 15 నుంచి 35 మిలియన్ ప్రయాణికులకు సేవలందించే విమానాశ్రయాల్లోని ఓ ఎయిర్‌పోర్టును ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పర్యావరణహితం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడమే కాకుండా నీటిని ఒడిసిపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగానూ 925 కేఎల్డీ సామర్థ్యం కలిగిన ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కిందని ఆ విమానాశ్రయ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.