ఇదే నా డిమాండ్!: హిందూ దేవాలయాలపై నాగబాబు వ్యాఖ్యలు
- హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదు
- బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ కూడా ఇదే చెప్పారు
- తమ జీవితాల్ని కొందరు హిందు ధర్మం కోసం త్యాగం చేశారు
- అటువంటి వారిని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానంలో చూడాలని ఉంది
హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ అన్నారని జనసేన నేత నాగబాబు తెలిపారు. ఓ న్యూస్ చానెల్‌లో తాను మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. అన్ని హిందూ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వంతో సంబంధంలేని వారి చేతుల్లోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
'జీవితాల్ని హిందు ధర్మం కోసం త్యాగం చేసిన చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు, గీత గంగాధర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానంలో చూడాలని ఉంది' అని నాగబాబు ట్వీట్లు చేశారు. ప్రార్థనాలయాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని ఆయన చెప్పుకొచ్చారు.