షోలాపూర్ మేయర్, తెలుగు మహిళ కాంచనకు కరోనా

  • ఆమె భర్తకు కూడా సోకిన వైరస్
  • వారుంటున్న ప్రాంతాన్ని శానిటైజ్ చేసిన అధికారులు
  • తొలి తెలుగు మేయర్‌గా రికార్డు
షోలాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) మేయర్ యెన్నం కాంచన, ఆమె భర్త రమేశ్ కరోనా బారినపడ్డారు. మేయర్ గత వారం రోజులుగా అస్వస్థతతో బాధపడుతుండడంతో పరీక్షించిన వైద్యులు కరోనా సోకినట్టు నిర్ధారించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమె భర్త, వెంట ఉండే అధికారులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో మేయర్ భర్త రమేశ్‌ మినహా మరెవరికీ వైరస్ సోకలేదని తేలింది. దీంతో మేయర్ దంపతులను ఆసుపత్రులకు తరలించారు.

మేయర్ దంపతులకు కరోనా సోకడంతో వారు ఉంటున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. ఆమెకు కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆమె ఎక్కడెక్కడ పర్యటించారు? ఎవరిని కలిశారనే వివరాలు రాబడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేటకు చెందిన కాంచన 2019 డిసెంబరులో జరిగిన షోలాపూర్ ఎన్నికల్లో మేయర్‌గా ఎన్నికై ఆ పదవిని అధిష్ఠించిన తొలి తెలుగు మహిళగా రికార్డులకెక్కారు.


More Telugu News