రజనీకాంత్ కు కరోనా అంటూ ఫేక్ ట్వీట్ చేసి తిట్లుతిన్న నటుడు
- రజనీపై ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్
- తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన అభిమానులు
- నవ్వించడానికే ఇలా చేశానని చెప్పిన రోహిత్
ఏదైనా జోక్ గా చేసేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. పైగా సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారికి సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. తాజాగా బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ చేసిన కామెంట్ ఆయనకు పెద్ద తలనొప్పే తీసుకొచ్చింది.
'సూపర్ స్టార్ రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనానే క్వారంటైన్ కు వెళ్లింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్తతో సగం మంది అభిమానులు హడలి పోయారు. ఆ తర్వాత అది జోక్ అని తెలుసుకుని కుదుటపడ్డారు.
ఈ ట్వీట్ వచ్చిన వెంటనే.. వైరల్ అయింది. ఏం జరిగిందో తెలుసుకుందామని అభిమానులు వార్త కోసం వెతకడం ప్రారంభించారు. అయితే, దీనికి సంబంధించిన వార్త ఎక్కడా కనిపించలేదు. దీంతో, రోహిత్ రాయ్ ను ఒక ఆట ఆడేసుకున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
ఆ తర్వాత రోహిత్ దీనిపై వివరణ ఇచ్చాడు. అందరినీ నవ్వించడానికే తాను ఈ పోస్ట్ చేశానని... ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పాడు. తనను క్షమించాలని వేడుకున్నాడు.