లాభాల్లో దూసుకుపోయిన మార్కెట్లు
- నిన్నటి నష్టాల నుంచి బయట పడిన మార్కెట్లు
- 307 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 113 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
ఆరు రోజుల ర్యాలీ తర్వాత నిన్న నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, మెటల్, టెలికాం తదితర సూచీలు ఈరోజు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు పెరిగి 34,287కి చేరుకుంది. నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 10,142 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.90%), టాటా స్టీల్ (6.00%), బజాజ్ ఫైనాన్స్ (3.44%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.14%), ఎన్టీపీసీ (3.00%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.19%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%), బజాజ్ ఆటో (-1.39%), ఇన్ఫోసిస్ (-0.57%), నెస్లే ఇండియా (-0.56%).