నిన్న సాయంత్రం వరకు మాపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది: డాక్టర్ సుధాకర్ తల్లి

  • డాక్టర్ సుధాకర్ డిశ్చార్జి కావొచ్చంటూ హైకోర్టు తీర్పు
  • తీర్పుపై ఆనందంగా ఉందన్న డాక్టర్ సుధాకర్ తల్లి
  • సుధాకర్ ను మరో ఆసుపత్రిలో చేర్చుతామని వెల్లడి
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఆయన తల్లి కావేరీబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డాక్టర్ సుధాకర్ డిశ్చార్జి కావొచ్చని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై కావేరీబాయి స్పందించారు. తన కుమారుడ్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పుతో తమకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. సుధాకర్ ను డిశ్చార్జి చేసి మరో ఆసుపత్రిలో చేర్పిస్తామని కావేరీబాయి చెప్పారు.  

ఈ వ్యవహారం మొత్తంలో తన బిడ్డకు జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని, నిన్న సాయంత్రం వరకు తమపై ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉందని అన్నారు. తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సీబీఐ కూడా న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. మరోసారి అవకాశం వస్తే సీబీఐకి మరిన్ని విషయాలు చెబుతానని ఆమె అన్నారు. 


More Telugu News