డాక్టర్ సుధాకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చు: ఏపీ హైకోర్టు అనుమతి
- గత నెల 16 నుంచి ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో సుధాకర్
- ఆయన తల్లి హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్
- ఈ రోజు విచారించి డిశ్చార్జ్‌కు అనుమతి
- సీబీఐ విచారణకు సహకరించాలని సూచన
గత నెల 16 నుంచి విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో వైద్యుడు సుధాకర్‌కు చికిత్స అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తల్లి వేసిన హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు విచారించి, సుధాకర్‌ను డిశ్చార్జ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆ ఆసుపత్రి సూరింటెండెంట్ ను సంప్రదించి ఆయన ఎప్పుడైనా డిశ్చార్జ్ కావచ్చని తెలిపింది. అలాగే, ప్రస్తుతం కొనసాగుతోన్న సీబీఐ విచారణకు ఆయన సహకరించాలని చెప్పింది.
తనకు ఎటువంటి అనారోగ్యం లేదని, అయినప్పటికీ మానసిక వైద్య శాలలో ఉంచారని సుధాకర్ వాదిస్తోన్న విషయం తెలిసిందే. సుధాకర్‌ను అరెస్టు చేయలేదని, అలాంటప్పుడు తన కుమారుడిని ఏ ప్రాతిపదికన ఆసుపత్రిలో బంధించారని ప్రశ్నిస్తూ ఆయన తల్లి హైకోర్టులో వేసిన పిటిషన్‌లో ప్రశ్నించారు. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు ఈ సూచనలు చేసింది.