టీటీడీ ఉద్యోగులతో ఈ ఉదయం మొదలైన తిరుమల దర్శనాల ట్రయిల్!
- రోజుకు 7 వేల మందికి మాత్రమే దర్శనం
- తలనీలాల సమర్పిణ రద్దు
- భక్తులు సహకరించాలన్న వైవీ సుబ్బారెడ్డి
దాదాపు రెండు నెలలకు పైగా దర్శనాలను నిలిపివేసిన తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తులను కనికరించాడు. ఈ ఉదయం ట్రయల్ రన్ జరిగింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటిస్తూ, స్వామిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈ ఉదయం 100 మంది ఉద్యోగులకు స్వామి దర్శనం చేయించి, గంటకు ఎంత మందిని పంపించవచ్చన్న అంశాన్ని పరిశీలించామని అన్నారు.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, 8 నుంచి 10 వరకూ స్థానికులు, ఇతర ఉద్యోగులతో ట్రయల్ రన్ కొనసాగుతుందని, నిత్యమూ 7 వేల మంది వరకూ దర్శనం కల్పించ వచ్చని ప్రాథమికంగా నిర్థారించామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు ఉంటాయని, టీటీడీ విధానాలను భక్తులు పాటించాలని సూచించారు.
తిరుమలలో తలనీలాలను సమర్పించే కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, మరో నాలుగు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అన్న ప్రసాద కేంద్రం వద్ద ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రం చేసుకోవాలని, తాజా కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి, తీర్థం, చటారి కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు.