మరి డాక్టర్లకు కరోనా ఎట్లా సోకింది?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- రాష్ట్రంలో లక్షల కొద్దీ పీపీఈ కిట్లున్నాయి అని చెప్పారు కదా?
- మీరు చెప్పినన్ని కిట్లు నిజంగానే ఉన్నాయా? లేవా?
- ఉంటే వాటి నాణ్యత సంగతేంది?
కరోనా వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వైద్యులకు పీపీఈ కిట్లు అందడంలేదని, ప్రభుత్వం మాత్రం వాటిని అందిస్తున్నామని చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు.
'రాష్ట్రంలో లక్షల కొద్దీ పీపీఈ కిట్లున్నాయి అని చెప్పారు కదా? మరి డాక్టర్లకు కరోనా ఎట్లా సోకింది? మీరు చెప్పినన్ని కిట్లు నిజంగానే ఉన్నాయా? లేవా? ఉంటే వాటి నాణ్యత సంగతేంది? ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలె' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా 'పీపీఈ కిట్లు ఇస్తే డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?' అంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేశారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో వైద్యులకు కరోనా సోకడంపై తెలంగాణ సర్కారును హైకోర్టు నిలదీసిందని అందులో ఉంది. వైద్యులకు పర్సనల్ మెడికల్ కిట్లు ఇవ్వాలని ఆదేశించిందని అందులో పేర్కొన్నారు.