డాక్టర్ సుధాకర్ కేసు: మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని విచారించిన సీబీఐ అధికారులు
- ఈ రోజు విచారణ నిమిత్తం నర్సీపట్నానికి సీబీఐ అధికారులు
- సుధాకర్ పనిచేసిన ఆసుపత్రిలో సర్వీసు రికార్డుల పరిశీలన
- నర్సీపట్నం మున్సిపల్ ఆఫీసుకి వెళ్లిన అధికారులు
ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు నర్సీపట్నం వెళ్లారు. సుధాకర్ పనిచేసిన ఆసుపత్రిలో ఆయన సర్వీసు రికార్డులను, హాజరులను పరశీలించారు.
అనంతరం నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని సీబీఐ అధికారులు విచారించారు. కాగా, కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాప్తి నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఓ సమావేశంలో పాల్గొన్న సుధాకర్ తమకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే ఈ వివాదం ప్రారంభమై సీబీఐ కేసు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విషయాలను సీబీఐ అధికారులు తెలుసుకుంటున్నారు.