అన్నీ అనవసరపు ఊహాగానాలే... అమెజాన్ తో డీల్ పై ఎయిర్ టెల్ క్లారిటీ!
- వచ్చిన కథనాలన్నీ అవాస్తవమే
- ఇన్వెస్టర్లు ప్యానిక్ అవుతారని ఎయిర్ టెల్ ఆందోళన
- ఏ విధమైన వ్యాఖ్యలూ చేయలేమన్న అమెజాన్
రిలయన్స్ జియోతో పలు కంపెనీలు భారీ డీల్స్ కుదుర్చుకున్న వేళ, ఇండియాలోని మరో టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తో అమెజాన్ సంస్థ మెగా ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని వచ్చిన వార్తలు అవాస్తవమని తేలింది. భారతీ ఎయిర్ టెల్ లో భారీ పెట్టుబడులంటూ వచ్చిన కథనాలన్నీ రూమర్లేనని సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఊహాగానపు వార్తలతో ఇన్వెస్టర్లు ప్యానిక్ అవుతారని, తమ ఈక్విటీ ధరపై ప్రభావం పడుతుందని సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇటువంటి ముఖ్యమైన వార్తలపై సంస్థ స్పందన లేకుండా కథనాలు ప్రచురించడం ద్వారా తమ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ఈ తరహాలో అధికారిక సమాచారం లేకుండా వచ్చే వార్తలను ఎవరూ నమ్మరాదని కోరారు.
ఎయిర్ టెల్ నుంచి వచ్చిన స్పష్టతతో ఇన్వెస్టర్లలో సంస్థపై నమ్మకం పెరుగగా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభం కాగానే, సంస్థ ఈక్విటీ ఏకంగా 2 శాతం పెరిగింది. ఇదిలావుండగా, ఎయిర్ టెల్ లో వాటాలను కొనే విషయంలో అమెజాన్ సైతం స్పందించింది. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నామన్న విషయంలో ఏ విధమైన వ్యాఖ్యలూ చేయలేమని సంస్థ వెల్లడించింది.