రూ.50 వేలు ఇస్తేనే పేదవాడికి ఇంటిస్థలమా?: దేవినేని ఉమ ఫైర్

  • భూసేకరణ పేరిట మీవాళ్లు కోట్ల రూపాయల వసూలు 
  • అడిగితే బెదిరింపులు.. దాడులు..
  • వందల కోట్ల కుంభకోణం
  • ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. '50 వేల రూపాయలు ఇస్తేనే  పేదవాడికి ఇంటిస్థలమా? భూసేకరణ పేరిట మీవాళ్లు కోట్లరూపాయల డబ్బులు వసూలు చేస్తున్నారు. అడిగితే బెదిరింపులు.. దాడులు.. వందలకోట్ల కుంభకోణం.. ఇంత విధ్వంసం ఎప్పుడూ చూడలేదని, దీనికి సమాధానం చెప్పాలని ప్రజలు తరుపున చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు చెప్పండి వైఎస్‌ జగన్‌ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
 
కాగా, ఈ సందర్భంగా 'రూ.50 వేలు' ఇస్తేనే జాగా పేరిట పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. రైతుల నుంచి తక్కువ ధరకే భూములు కొన్నామని, సదరు రైతుకు లబ్ధిదారులే అదనపు మొత్తం చెల్లించాలంటూ అధికార పార్టీ నేతలు కొన్ని చోట్ల కొత్త కుంభకోణానికి తెరలేపారని అందులో ఉంది. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.35 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. భూ సేకరణ వ్యయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని ఆ పత్రికలో చెప్పారు. 'రైతులకు న్యాయం' పేరిట లబ్ధిదారుల నుంచి ఈ డబ్బు తీసుకుంటున్నారని తెలిపారు.


More Telugu News