భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లూవాలియా కారును వెంబడించిన పాకిస్థాన్ ఐఎస్ఐ.. వీడియో వైరల్
- పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఇద్దరు అధికారులను బహిష్కరించిన భారత్
- ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్
- గౌరవ్ కారును వెంబడించి బెదిరించిన ఐఎస్ఐ ఏజెంట్
గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను భారత్ బహిష్కరించిన తర్వాత ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పాక్.. అక్కడి భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లూవాలియాను బెదిరించే ప్రయత్నం చేసింది.
ఇస్లామాబాద్‌లో గౌరవ్ నివాసం బయట వేచి చూసిన పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన వ్యక్తి.. గౌరవ్ కారును బైక్‌పై వెంబడించాడు. అంతేకాక, ఆయనను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారులు అబిద్ హుస్సేన్, ముహమ్మద్ తాహిర్‌లు భారత సైన్యానికి సంబంధించిన రహస్య పత్రాలను పొందే ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది. తమ దౌత్యవేత్తలపై భారత్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్న పాకిస్థాన్.. అప్పటి నుంచి ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ప్రతీకార చర్యగా పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్ నుంచి భారత అధికారులను బహిష్కరించే అవకాశం ఉందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.