ఏనుగు మృతి కేసు.. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు

  • గర్భంతో ఉన్న ఏనుగుకు టపాసులతో కూడిన పైనాపిల్ 
  • నోటిలో గాయం కారణంగా ఆహారం తీసుకోలేక మృతి
  • దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును అత్యంత పాశవికంగా చంపిన ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఆకలితో ఉన్న ఏనుగుకు టపాసులతో కూడిన పైనాపిల్ అందించి చంపిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు, ఈ ఘటనను కేరళ ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తు కోసం పోలీసు, అటవీశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నోటిలో గాయం కారణంగా ఆహారం తీసుకోలేకపోయిన ఏనుగు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. కాగా, ఏనుగు మరణానికి కారణమైన వారిగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.


More Telugu News