రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగపడని జీరో సీఎం: చంద్రబాబు విమర్శలు

  • వీడియో విడుదల చేసిన చంద్రబాబు
  • ఏడాదిలో వ్యవస్థలను గాడి తప్పించారని వ్యాఖ్యలు
  • స్వార్థం కోసం అభివృద్ధిని ఆపేశారని మండిపాటు
  • అమరావతి, పోలవరం ఆపివేతే నిదర్శనమని వెల్లడి
సీఎం జగన్ ఏడాది పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క పైసా ఉపయోగపడని జీరో సీఎం అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. వ్యవస్థలు, అభివృద్ధి ఒకసారి గాడినపడ్డాక కొత్తగా ఏమీ చేయకపోయినా, అదే పంథాను కొనసాగిస్తే ప్రజలు ఆ ఫలాలను అందుకుంటూ ముందుకు పోతారని, కానీ వైసీపీ వాళ్లు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనూ వ్యవస్థలన్నింటిని గాడి తప్పించారని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను చక్కదిద్ది, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తే... వైసీపీ వాళ్లు తమ స్వార్థం కోసం కావాలనే అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి, పోలవరం పనుల నిలిపివేతే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

"ఏడాది కాలంలో వచ్చిన పరిశ్రమలు శూన్యం, ఉద్యోగాలు సున్నా, రాష్ట్ర ప్రగతీ అంతే. ప్రజల ఆదాయంలో సున్నా, నిర్మాణాలు సున్నా" అంటూ ఎద్దేవా చేశారు. ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వేయడం తప్ప ఈ సున్నా ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? అని ప్రశ్నించారు.


More Telugu News