అప్పుడు బాల్కనీ నుంచి దూకి చనిపోవాలనిపించేది: క్రికెటర్ ఉతప్ప
- 2009, 2011 మధ్య ఆత్మహత్య ఆలోచనలు
- ఆ ఆలోచన వచ్చినప్పుడు 1,2,3 అంటూ లెక్కపెట్టేవాడిని
- నా జీవితం ఎటుపోతోందనే ఆందోళన ఉండేది
- నెట్స్‌లో రాణించలేకపోయాను
గతంలో తాను అనేక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని క్రికెటర్ ఉతప్ప తెలిపాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2009, 2011 మధ్య ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని చెప్పాడు.
తనకు క్రికెట్ అవకాశాలు రాకపోవడంతో తన జీవితం ఎటుపోతోందనే ఆందోళన ఉండేదని తెలిపాడు. పదే పదే ఇవే ఆలోచనలతో సతమతమయ్యానని చెప్పాడు. బాల్కనీ నుంచి దూకాలని అనిపించేదని, అటువంటి ఆలోచనలు వచ్చిన సమయంలో కుర్చీలో కూర్చొని ఒకటి, రెండు, మూడు అని లెక్కపెట్టేవాడినని, దాంతో ఆ ఆలోచనను అధిగమించేవాడినని చెప్పాడు.
తన జీవితంలో మార్పుల కోసం కొందరి సాయం తీసుకున్నానని అన్నాడు. నెట్స్‌లో తాను కష్టపడినా ఒక్క పరుగూ చేయలేకపోయేవాడినని తెలిపాడు. గంటల కొద్దీ నెట్స్‌లోనే గడిపే వాడినని, అయినా రాణించలేకపోయేవాడినని చెప్పాడు. కొన్నాళ్లకు తను దేశవాళీ టోర్నీల్లో రాణించాడు. అయితే, 2015 తర్వాతి నుంచి టీమిండియాలో ఆడట్లేదు.