30 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు... ఏపీలో నూతన పారిశ్రామిక విధానం

  • ఈ నెల 26న కొత్త పారిశ్రామిక విధానం ఖరారు
  • నాలుగు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా నయా విధానం
  • అవినీతికి చోటివ్వని విధానం అంటూ మంత్రి వివరణ
నాలుగు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఏపీలో సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 26న కొత్త పారిశ్రామిక విధానం ఖరారు చేస్తామని, నూతన విధానం అమల్లోకి వస్తే కేవలం 30 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు వస్తాయని వివరించారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని వనరులు సమకూర్చుతామని, స్థలం, నీరు, విద్యుచ్ఛక్తి, నిపుణతతో కూడిన మానవ వనరులు అందిస్తామని తెలిపారు.  

అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని, పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని, ఈ మేరకు సీఎం జగన్ కూడా స్పష్టం చేశారని వివరించారు. మంత్రి ఆధ్వర్యంలో ఇవాళ ఇండస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంపై చర్చ జరిగింది.


More Telugu News