ఏనుగును చంపడాన్ని సాటి మనిషిని చంపడంగానే పరిగణించాలి: రతన్‌ టాటా సహా ప్రముఖుల డిమాండ్

  • ఈ ఘటన తనను కలచివేసిందన్న రతన్ టాటా  
  • కఠిన చర్యలు తీసుకోవాలన్న కోహ్లీ, అక్షయ్, నటి ప్రణీత
  • చంపిన వారి వివరాలు తెలిపితే రూ.50 వేల బహుమతి
  • ప్రకటించిన హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా
పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టి కేరళలోని మలప్పురంలో ఓ ఏనుగును కొందరు చంపేసిన ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏనుగు మృతి ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అమాయక ఏనుగును క్రూరంగా చంపిన ఘటన తనను కలచివేసిందని పారిశ్రామిక వేత్త రతన్ టాటా తెలిపారు. ఇటువంటి అమాయక జంతువులపై హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని కోరారు.

ఏనుగును చంపిన ఘటనను క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రణదీప్‌ హుడా, టాలీవుడ్ నటి ప్రణీత డిమాండ్ చేశారు. కాగా, ఏనుగును చంపిన వారి వివరాలు తెలిపితే రూ.50 వేల బహుమతి ఇస్తామని హ్యూమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.


More Telugu News