తుపాను ప్రభావం.. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌ల వైపుగా కదిలిన మిడతల దండు

  • నిసర్గ్ తుపాను గాలుల ప్రభావానికి  ఝార్ఖండ్ వైపుగా పయనం
  • ఐదు రోజులుగా రామగుండం కేంద్రంగా పర్యవేక్షిస్తున్న ప్రత్యేక బృందం
  • ప్రయోగం కోసం కొన్ని మిడతలను తీసుకెళ్లిన అధికారులు
దేశంలోకి చొచ్చుకొచ్చిన మిడతల దండు మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లవైపుగా పయనించినట్టు అధికారులు గుర్తించారు. నిసర్గ్ తుపాను కారణంగా ఆ గాలుల ప్రభావానికి మిడతల సమూహం నాగ్‌పూర్, రాంటెక్ మీదుగా మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లవైపు పయనించింది.

కాగా, మిడతల దండు నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన అధికారుల ప్రత్యేక బృందం ఐదు రోజులుగా రామగుండం కేంద్రంగా పర్యవేక్షిస్తోంది. అలాగే, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించింది. నిన్నటితో పర్యటన ముగియగా, ప్రయోగం కోసం కొన్ని మిడతలను ఈ బృందం తీసుకెళ్లింది.


More Telugu News