తెలంగాణలో నేడు కొత్తగా 127 కరోనా కేసుల నమోదు.. ఏడుగురి మృతి

  • హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం
  • 3,020కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • వందకు చేరువైన మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. నేటి సాయంత్రం ఐదు గంటల వరకు 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 127 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,020కి పెరిగింది.

నేడు నమోదైన కేసుల్లో 108 జీహెచ్ఎంసీ పరిధిలో వెలుగు చూడగా, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలలో చెరో ఆరు, మేడ్చల్, సిరిసిల్లలో చెరో రెండు, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలలో చెరో కేసు నమోదైనట్టు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

అలాగే, వలసదారుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 99కి చేరింది. తాజాగా, 92 మంది కోలుకోవడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1556కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1,365 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


More Telugu News