చిరంజీవితో పాటు బాలయ్యను కూడా పిలవాల్సిందే.. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు: తేజ సంచలన వ్యాఖ్యలు
- ఎవరు లేకున్నా ఇండస్ట్రీ నడుస్తుంది
- బాలయ్యను పిలవకుండా తప్పు చేశారు
- మా వల్లే ఇండస్ట్రీ నడుస్తోందని కొందరు అనుకుంటారు
తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖులు జరిపిన సమావేశంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు రకరకాలుగా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఉన్న విభేదాలను ఇది మరోసారి బట్టబయలు చేసింది.
మంత్రి తలసానితో కూర్చొని సమావేశానికి హాజరైన వారు భూములు పంచుకున్నారా? అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించాయి. ఆ తర్వాత... బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు వ్యాఖ్యానించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఇండస్ట్రీ నడుస్తుందని తేజ అన్నారు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదని చెప్పారు. ఎన్టీఆర్, సావిత్రి పోయిన తర్వాత కూడా ఇండస్ట్రీ కొనసాగుతూనే ఉందనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మధ్యలో వచ్చిన కొందరు తమ వల్లే ఇండస్ట్రీ నడుస్తోందని అనుకుంటుంటారని.. అదంతా భ్రమ అని చెప్పారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ మీటింగ్ జరిగినా పెద్ద వాళ్లందరినీ పిలవాల్సిందేనని అన్నారు.
ఇటీవల జరిగిన సమావేశం ఇండస్ట్రీ గురించి జరిగిందో? లేదో? తనకు తెలియదని... ఒకవేళ అది ఇండస్ట్రీ మీటింగ్ అయితే మాత్రం చిరంజీవితో పాటు బాలకృష్ణను కూడా కచ్చితంగా పిలవాల్సిందేనని తేజ స్పష్టం చేశారు. ఇండస్ట్రీ మీటింగ్ అయితే మాత్రం... బాలయ్యను పిలవకుండా పెద్ద తప్పు చేసినట్టేనని అన్నారు. పరిశ్రమకు పిల్లర్ వంటి వారు ఎవరున్నా... వారందరినీ పిలవాల్సిందేనని చెప్పారు.