కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం... జన్ ధన్ ఖాతాల్లోకి మరో విడత డబ్బు జమ!
- లాక్ డౌన్ నేపథ్యంలో మహిళలకు ఆర్థికసాయం
- ఇప్పటికే రెండు విడతల డబ్బు జమ
- జూన్ 5 నుంచి చివరి విడత డబ్బు జమ
పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న మహిళలకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. 500ల వంతున జన్ ధన్ ఖాతాల్లో డబ్బు జమ చేసిన కేంద్రం.
తాజాగా మూడో విడత డబ్బు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విడతలో కూడా ఈ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలోకి రూ. 500 జమ కానున్నాయి. జూన్ 5వ తేదీ నుంచి 10 వరకు డబ్బు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి చివరి విడత డబ్బును జమ చేస్తున్నట్టు తెలిపింది.