వారిలాగే జగన్ కూడా రాజీనామా చేయాలి: తులసిరెడ్డి
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత
- కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా సిగ్గులేని ప్రభుత్వమిది
- రంగులు తొలగించేందుకు అధికారుల నుంచి డబ్బులు వసూలు చేయాలి
అప్పట్లో ఓ సంఘటనలో కోర్టు మందలించినందుకు నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిలు సీఎం పదవులకు రాజీనామా చేశారని, ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఏ మాత్రం సిగ్గున్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ భవనాలకు వైసీపీ రంగుల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన తులసిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రంగులు తొలగించేందుకు అధికారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని అన్నారు. కోర్టు నుంచి అక్షింతలు పడితే తప్ప ప్రభుత్వానికి నిద్రపట్టేలా లేదని ఆయన ఎద్దేవా చేశారు. కోర్టులు పదేపదే మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గుండడం లేదని, మూర్ఖంగా వ్యవహరిస్తోందని తులసిరెడ్డి మండిపడ్డారు.