నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణాన్ని చూడలేదు.. చాలా బాధతో మాట్లాడుతున్నా: ఆనం రామనారాయణరెడ్డి
- జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉంది
- వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయినట్టున్నారు
- ప్రజల కోసం ఏమీ చేయలేకపోతున్నా
ఈ ఏడాది పాలనలో తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. ఎమ్మెల్యే పదవి తనకు అలంకారప్రాయం కాదని అన్నారు. జిల్లా అధికారుల తీరు దారుణంగా ఉందని... వెంకటగిరి నియోజకవర్గాన్ని వారు మర్చిపోయినట్టున్నారని ఆయన మండిపడ్డారు.
తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా అందేవి తప్ప... ఇతర ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని ఆనం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల కోసం తాను ఏమీ చేయలేకపోతున్నానని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత దారుణంగా పని చేయడాన్ని తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. జలవనరుల శాఖలోని అధికారులే నీళ్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు డీపీఆర్ లు ఇచ్చామని... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు.