సీఎం పళనిస్వామి ఇంటిని పేల్చేస్తామని ఫోన్ కాల్.. అప్రమత్తమైన పోలీసులు

  • పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన గుర్తు తెలియని యువకుడు
  • రంగంలోకి దిగిన బాంబ్, డాగ్ స్క్వాడ్ టీములు
  • ఫేక్ కాల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్న పోలీసులు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసం, కార్యాలయంపై బాంబులతో దాడి చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక గుర్తు తెలియని యువకుడు ఫోన్ చేశాడు. ఈ బెదిరింపు కాల్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ టీములను వెంటనే రంగంలోకి దించారు. పళనిస్వామి నివాసం, కార్యాలయం సమీపంలో తనిఖీలను చేపట్టారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ గా తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, బెదిరింపు కాల్ చేసిన యువకుడి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపును ప్రారంభించారు.

ఇదే సమయంలో చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయం వద్ద భద్రతను పెంచారు. మరోవైపు, పళనిస్వామి నివాసం, కార్యాలయానికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది.


More Telugu News