డాక్టర్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసిన సీబీఐ!
- ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం
- హైకోర్టు తీర్పుతో రంగంలోకి దిగిన సీబీఐ
- పలు సెక్షన్ల కింద సుధాకర్ కేసు నమోదు
వైజాగ్ డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగడంతో వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే పోలీసులపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
తాజాగా డాక్టర్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసింది. నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మాట తూలడం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్ సైట్లో ఉంచింది.
పోలీసులపై సీబీఐ నమోదు చేసిన కేసులో కావాలని తిట్టడం, కుట్ర కోణం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి.