వచ్చే వారంలో భారత్‌కు 100 వెంటిలేటర్లను పంపుతాం: అమెరికా
- నిన్న ఫోనులో మాట్లాడుకున్న ట్రంప్, మోదీ
- భారత్‌కు సాయం చేసే అవకాశం రావడం పట్ల ట్రంప్ హర్షం
- అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపిన భారత్
కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్‌కు తాము వెంటిలేటర్లు అందిస్తామని ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి విడతగా వచ్చే వారంలో 100 వెంటిలేటర్లను పంపుతామని శ్వేతసౌధం ప్రకటించింది. నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోనులో మాట్లాడుకున్నారు. భారత్‌కు సాయం చేసే అవకాశం రావడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేసినట్లు శ్వేతసౌధం తెలిపింది.
రెండు నెలల క్రితం అమెరికాకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేసిన విషయం తెలిసిందే. కాగా, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సుకు రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు వంటి అంశాలపై కూడా వారు మాట్లాడుకున్నారు.