సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పెళ్లికి సిద్ధమవుతున్న నయనతార
- కరణం మల్లేశ్వరి పాత్రలో తాప్సీ
- 'లవ్ స్టోరీ' హక్కులకు భారీ రేటు
* తమిళ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రముఖ కథానాయిక నయనతార గత కొంతకాలంగా ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరుగుతుందని తెలుస్తోంది.
* మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన కరణం మల్లేశ్వరి జీవిత కథ వెండితెరకు ఎక్కుతున్న సంగతి విదితమే. సంజనా రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మల్లేశ్వరిగా ప్రముఖ నటి తాప్సీ నటించే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ఈ హక్కులు మొత్తం 16 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఆగష్టులో థియేటర్లలో విడుదల కావచ్చు.