విద్యుత్ సవరణ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్
- విద్యుత్ సవరణ బిల్లు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు
- రాష్ట్రాల నుంచి అభిప్రాయాల స్వీకరణ
- బిల్లు ఉపసంహరించుకోవాలంటూ సీఎం కేసీఆర్ డిమాండ్
కేంద్రం త్వరలో విద్యుత్ సవరణ బిల్లు-2020ను తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సవరణ బిల్లుపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలను కోరింది. దీనిపై స్పందిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకత వ్యక్తం చేశారు.
విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వెలిబుచ్చారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ లేఖ రాశారు.