సింగరేణి ప్రమాదం దురదృష్టకరం: పవన్ కల్యాణ్

  • రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం
  • నలుగురు కాంట్రాక్టు కార్మికుల దుర్మరణం
  • రెగ్యులర్ కార్మికుల తరహాలో నష్టపరిహారం ఇవ్వాలన్న పవన్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ తీరని విషాదం కలిగిస్తూ సింగరేణి గనుల్లో పేలుడు సంభవించి కార్మికులు మృత్యువాత పడడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో పేలుడు సంభవించి నలుగురు కార్మికులు దుర్మరణం చెందడం దురదృష్టకరమని పవన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికులు నలుగురూ పేద వర్గాలకు చెందని వారని, వారు కాంట్రాక్టు కార్మికులు అయినా రెగ్యులర్ కార్మికులకు ఇచ్చే విధంగా నష్టపరిహారం అందించాలని పవన్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇకమీదట గనుల్లో పేలుడు పదార్థాల నిర్వహణ, బ్లాస్టింగ్ వంటి ప్రమాదకర పనుల కోసం రోబోలు, అత్యాధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టడంపై పరిశీలించాలని సూచించారు.


More Telugu News