మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
- నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం
- పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసనలకు కాంగ్రెస్ నేతల యత్నం
- కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన సర్కారు
ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వేశ్వర్ రెడ్డిని తరలించేందుకు పోలీసులు రాగా, ఆయన వారిని అడ్డుకున్నారు. వారెంట్ చూపించాలని నిలదీశారు. వారెంట్ ఉంటేనే వస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. పోలీసులే చట్టాన్ని గౌరవించకపోతే ఎలా? అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.