ఈ రోజూ లాభాలు రుచిచూసిన స్టాక్ మార్కెట్లు!
- వరుసగా ఐదో రోజు కూడా లాభాలు
- 522.01 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
- బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల షేర్లు కళకళ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. దేశంలో లాక్ డౌన్ పరంగా మరిన్ని సడలింపులు రావడంతో, అన్ని రంగాలలోనూ ఆర్థిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. దీంతో ఈ పరిణామం స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఈవేళ వరుసగా ఐదో రోజు కూడా మన మార్కెట్లు భారీ లాభాలలో ముగిశాయి.
దీంతో సెన్సెక్స్ 522.01 పాయింట్లు లాభపడి 33,825.53వద్ద, నిఫ్టీ 153.95 పాయింట్ల లాభంతో 9,979.10 వద్ద క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల షేర్లను కొనుగోలు చేయడానికి మదుపర్లు ఆసక్తి చూపారు. పలు లార్జ్ క్యాప్ షేర్లే కాకుండా కొన్ని చిన్న, మధ్యతరహా కంపెనీల షేర్లు కూడా లాభాలను దండుకున్నాయి.
ఇక ఈ రోజు బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఏక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా; కోల్ ఇండియా, మారుతి సుజుకి, ఐటీసీ, డా. రెడ్డీస్, బీపీసీఎల్ తదితర కంపెనీలు నష్టాల బాట పట్టాయి.