తెలంగాణ ప్రజలకు కోవింద్ శుభాకాంక్షలు... తెలుగులో మోదీ ట్వీట్లు
- తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు
- తెలుగు చరిత్ర పట్ల దేశం యావత్తు గర్వపడుతోందన్న కోవింద్
- ఏపీ ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపిన మోదీ
- కృషి, పట్టుదల వారి సంస్కృతికి మారు పేరని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘన చరిత్ర గల తెలుగు చరిత్ర, సాహిత్యం పట్ల దేశం యావత్తు గర్వపడుతోంది. బాగా కష్టపడే స్వభావమున్న తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. రానున్న రోజుల్లోనూ తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నాను' అని రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణతో పాటు ఏపీ ప్రజలను ఉద్దేశించి మోదీ ట్వీట్లు చేశారు. 'తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మోదీ శుభాకాంక్షలు చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి, పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.