వైరస్ బలహీనపడిందన్న ఇటలీ వైద్యుడు.. ఖండించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

వైరస్ బలహీనపడిందన్న ఇటలీ వైద్యుడు.. ఖండించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • ఇటలీ సీనియర్ వైద్యుడి వ్యాఖ్యలను ఖండించిన జెనీవా వైద్యుడు
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఖండించిందన్న వైద్యుడు
  • అపోహలు ప్రచారం చేయొద్దని సూచన
కరోనా వైరస్ బలహీనపడిందని, ఇప్పుడది సోకితే మరణించే అవకాశాలు తగ్గాయని ఇటలీ సీనియర్ వైద్యుడు చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. మిలాన్‌లోని శాన్ రాఫెల్ ఆసుపత్రి హెడ్ అయిన అల్బెర్ట్ జంగ్రిల్లో మాట్లాడుతూ.. రెండు నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. అయితే, నిపుణులు మాత్రం రెండో దశ వ్యాప్తి విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

అయితే, వైరస్ బలహీనపడిందన్న అల్బెర్ట్ వ్యాఖ్యలను జెనీవాలోని శాన్ మార్టినో ఆసుపత్రికి చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ క్లినిక్ హెడ్ మోషియో బసెటి ఖండించారు. ఆ వాదనలో నిజం లేదన్నారు. వైరస్ రెండు నెలల క్రితం ఉన్నంత శక్తిమంతంగా ఇప్పుడు లేదన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఖండించిందని పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి అపోహలను ప్రచారం చేయొద్దని సూచించారు.


More Telugu News