నాగబాబు వ్యాఖ్యలపై స్పందించమంటే... బాలకృష్ణ జవాబు ఇదిగో!
- ఇటీవల బాలకృష్ణపై నాగబాబు వ్యాఖ్యలు
- అన్నీ అతడే మాట్లాడుతున్నాడన్న బాలయ్య
- ఇండస్ట్రీ మొత్తం నాకే సపోర్ట్ చేస్తోంది అంటూ బాలయ్య ధీమా
ఇటీవల టాలీవుడ్ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడంతో వివాదం రూపుదాల్చింది. ఈ విషయంలో బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయగా, దానికి నాగబాబు ప్రతిస్పందించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్యను యాంకర్ ప్రశ్నించింది. నాగబాబు వ్యాఖ్యలపై ఏమంటారని అడగ్గా... "ఛీ, ఛీ... నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?" అంటూ బదులిచ్చారు.