జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు... షెడ్యూల్ ఖరారు

  • కరోనా వ్యాప్తి కారణంగా గతంలో వాయిదాపడిన ఎన్నికలు
  • మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు
కరోనా వ్యాప్తి కారణంగా ఓసారి వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈసారి 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికార వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి బరిలో ఉన్నారు. కాగా, ఏపీలోని నాలుగు స్థానాలతో పాటు గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, ఝార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.


More Telugu News