చల్లని కబురు.. ఈరోజు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం
- ఛత్తీస్ గఢ్ నుంచి లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి
- తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్ష సూచన
గత కొన్ని రోజులుగా మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈశాన్య రుతుపవనాలు ఈరోజు కేరళ తీరాన్ని తాకనున్నాయని వెల్లడించింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు అవి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.