ఇండియాను పదేపదే కవ్విస్తున్న నేపాల్... మరోమారు మ్యాప్ లు మారుస్తూ బిల్ తెచ్చిన ప్రధాని!
- లిపులేఖ్, కాలాపానీ తమవేనంటూ మ్యాప్
- గత వారంలో అడ్డుకున్న విపక్షాలు, ఇప్పుడు ఓకే
- బిల్లు తెచ్చిన మంత్రి శివమయ్యా
ఇండియాకు సరిహద్దు దేశంగా ఉంటూ, చైనాతో సన్నిహితంగా మెలగుతున్న నేపాల్ ప్రధాని మరోమారు కవ్వింపు చర్యలకు దిగేలా, లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను తమ భూమేనంటూ ఇంకో బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
గత వారంలో ఇదే బిల్లును పెట్టగా, విపక్షాలతో పాటు, నేపాల్ మిలిటరీ అడ్డుకోగా, వెనక్కు తగ్గిన ప్రధాని కేపీ ఓలీ శర్మ, ఈ దఫా మరో మార్గంలో బిల్లును తెచ్చారు. దేశంలో ప్రతిపక్షంలా ఉన్న నేపాలీ కాంగ్రెస్ బిల్లుకు మద్దతిస్తామని తెలిపిన మరుసటి రోజే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శివమయ్యా బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తెచ్చారు.
నేపాల్ రాజ్యాంగం ప్రకారం, ఈ మ్యాప్ కు చట్టబద్ధత కావాలంటే, పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. దీంతో పాటు రాజ్యాంగాన్నీ సవరించాలి. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకునేందుకు ఓలీ శర్మ తాపత్రయపడుతున్నారు.
మరోపక్క, లిపులఖ్, కాలాపానీ తదితర ప్రాంతాలు తమవేనని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది. చైనా ప్రోద్బలంతోనే నేపాల్ ప్రధాని, ఇలా భారత్ ను కవ్విస్తుండగా, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్యా నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షను కూడా నిర్వహించారు. ఇరు దేశాల మధ్యా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస సూచించిన సంగతి తెలిసిందే.