మోదీ ఏదైనా చేస్తారన్న భయంతో ఆయన మాటను జగన్ వింటే వింటారు: జేసీ దివాకర్ రెడ్డి
- నేను తప్ప గొప్పవారు ఎవరూ లేరనే మాట కరెక్టు కాదు
- ఈ తీరును జగన్ మార్చుకోవాలి
- ఆయన ఎవరి మాటా వినడు
- హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం సరికాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'నేనే రాజు.. నేను తప్ప గొప్పవారు ఎవరూ లేరు అనే మాట కరెక్టు కాదు. ఈ తీరును జగన్ మార్చుకోవాలి' అని సూచించారు.
'ఆయన ఎవరి మాటా వినడు. ఆయన కేవలం మోదీ మాట వినే అవకాశముంది. మోదీ ఏదైనా చేస్తారన్న భయంతో జగన్ ఆయన మాట వింటే వింటారు. సీఎం జగన్ హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయట్లేదు' అని అన్నారు.
'హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం సరికాదు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో చదువుకున్న ప్రతిఒక్కరికీ తెలుసు' అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.