'చారిత్రాత్మక నిర్ణయాలు' తీసుకునే అవకాశం.. మోదీ నేతృత్వంలో కాసేపట్లో కేబినెట్ భేటీ

  • లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో భేటీ
  • ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది
  • అనంతరం కేబినెట్ తొలిసారి భేటీ
  • లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలపై కూడా చర్చ 
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. లాక్‌డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు జరగబోయే కేబినెట్‌ భేటీలో ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన అనంతరం కేబినెట్ తొలిసారి భేటీ అవుతోంది. కేంద్ర ఆర్థిక, భద్రత కేబినెట్‌ కమిటీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కరోనా, లాక్‌డౌన్‌ అంశాలతో పాటు లడఖ్‌లో చైనా దుందుడుకు చర్యలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


More Telugu News