రాష్ట్ర ఎన్నికల సంఘంలో రాజ్యాంగ సంక్షోభం: దేవినేని ఉమ
- కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గందరగోళం
- ఈసీ సమగ్రత పట్ల అగౌరవం దురదృష్టకరం
- మీ ప్రభుత్వ వైఖరి హైకోర్టు తీర్పును ఉల్లంఘించడం కాదా?
- ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గందరగోళం. ఈసీ సమగ్రత పట్ల అగౌరవం దురదృష్టకరం. రాష్ట్ర ఎన్నికల సంఘంలో రాజ్యాంగ సంక్షోభం. మీ ప్రభుత్వ వైఖరి హైకోర్టు తీర్పును ఉల్లంఘించడం కాదా? ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్ట్ చేశారు.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెచ్చిన ఆర్డినెన్స్, జీవోలను హైకోర్టు రద్దు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకం రద్దయిందని అందులో ఉంది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మళ్లీ పదవిలోకి రాగా, ఆయన మళ్లీ బాధ్యతలు స్వీకరించారని ఎస్‌ఈసీ కార్యాలయం ఓ సర్క్యులర్ జారీచేసిందని పలు పత్రికల్లో పేర్కొన్నారు. అయితే, అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడం లేదని, ఆయనను హైకోర్టు పునర్నియమించలేదని వాదిస్తోందని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించిందని పత్రికల్లో పేర్కొన్నారు.