తొలకరితో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట షురూ... ఆరు దొరికాయని వార్తలు!

  • తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాలకు ప్రజలు
  • రోజంతా వెతుకుతున్న ప్రజలు
  • వజ్రాలు కొనేందుకు దళారులు సిద్ధం
తొలకరి వర్షాలు పడగానే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వజ్రాల వేట మొదలైంది. వర్షాలు కురుస్తూ ఉండటంతో తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి తదితర మండలాల్లో భూమి లోపలి నుంచి బయటకు వచ్చే వజ్రాలు, రంగురాళ్ల కోసం ప్రజలు పెద్దఎత్తున వేట ప్రారంభించారు.

గుంతకల్, ద్రోణాచలం ప్రాంతాల్లో మకాం వేసి, అక్కడి నుంచి వజ్రాలు దొరుకుతాయన్న భూముల్లోకి వెళ్లి, రోజంతా వెతుకున్న వారి సంఖ్య గత రెండు రోజుల్లో భారీగా పెరిగిపోయింది. ఈ సీజన్ లో ఇప్పటికే ఆరు వజ్రాలు దొరికాయని ఇక్కడి వారు అంటున్నారు. ఇక, ఇక్కడి వారికి దొరికే వజ్రాలను కొనుగోలు చేసేందుకు ముంబయి, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే మధ్యవర్తులు సైతం సిద్ధంగా ఉన్నారు.

ఈ సంవత్సరం కరోనా, లాక్ డౌన్ కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. స్థానికులు మాత్రం పిల్లా పాపలతో సహా పెద్దఎత్తున వజ్రాల కోసం వెతుకుతూ, తమను అదృష్టం వరించాలని కోరుకుంటున్నారు.


More Telugu News