పిడుగుపాటుతో దద్దరిల్లిన తాజ్ మహల్

  • వాతావరణంలో మార్పులు
  • ఉరుములు, మెరుపులతో కూడిన వానలు, పిడుగులు
  • పిడుగుపాటుతో తాజ్ మహల్ లో దెబ్బతిన్న పలు నిర్మాణాలు
దేశవ్యాప్తంగా పిడుగుపాటు ఘటనలు ఎక్కువయ్యాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు సాధారణమైపోయాయి. తాజాగా, ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్ మహల్ వద్ద కూడా పిడుగులు పడ్డాయి. పిడుగుల ధాటికి తాజ్ మహల్ కదిలిపోయింది.

ఈ పిడుగుపాటుతో ప్రధాన ద్వారం వద్ద గోడలు, రాతితో నిర్మించిన పిట్టగోడ, పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ, పర్యాటకులు నిల్చునే ప్రదేశంలోని పైభాగం దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ పిడుగులు పడినట్టు భావిస్తున్నారు. కాగా, పిడుగుపాటుపై వెంటనే స్పందించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.


More Telugu News