ఇంజిన్ ఆపకుండా బైక్ ను శానిటైజ్ చేస్తే ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

  • కరోనా రాకతో శానిటైజర్లకు గిరాకీ
  • వాహనాలను కూడా శానిటైజ్ చేసే ఏర్పాట్లు
  • శానిటైజ్ చేయగానే భగ్గుమన్న బైక్
కరోనా మహమ్మారి కారణంగా శానిటైజర్లకు ఎంత గిరాకీ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాణాంతక వైరస్ ను చేతులు శుభ్రపరుచుకోవడం ద్వారా దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా శానిటైజర్లు విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఏకంగా మనిషి మొత్తాన్ని శుభ్రపరిచే యంత్రాలు కూడా వచ్చాయి. ఇక, పిచికారీ యంత్రంతోనూ బైకులను, ఇతర వాహనాలను ఇన్ఫెక్షన్ అంటకుండా క్లీన్ చేస్తున్నారు. అయితే, బైకు ఇంజిన్ ఆపకుండా శానిటైజ్ చేస్తే ఎంత ప్రమాదమో ఈ కింది వీడియో చూస్తే అర్థమవుతుంది.

రన్నింగ్ బైక్ ను శానిటైజ్ చేసే ప్రయత్నం చేయగా, అది ఒక్కసారిగా భగ్గున అంటుకుంది. వాహనదారుడు ఎలాగోలా తప్పించుకున్నాడు. అసలు కారణం ఏంటంటే... శానిటైజర్ లో ఆల్కహాల్ కూడా కలిసి ఉంటుంది. ఆల్కహాల్ కు మండే గుణం ఉన్నందున ఏ చిన్న నిప్పురవ్వ తగిలినా అది క్షణాల్లో అంటుకుంటుంది. బైక్ ఇంజిన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అందులోంచి స్పార్క్స్ వస్తుంటాయి. అందుకే ఇంజిన్ ఆపని బైక్ ను శానిటైజ్ చేయగానే ఒక్కసారిగా అంటుకుంది. అదెలాగో మీరూ చూడండి..!



More Telugu News