ఎస్ఈసీ అంశంలో ఏజీ వ్యాఖ్యలపై స్పందించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్

  • ప్రకటన విడుదల చేసిన నిమ్మగడ్డ
  • హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపణ
  • ఇది హైకోర్టు తీర్పు ఉల్లంఘనే అంటూ వ్యాఖ్యలు
ఏపీ ఎస్ఈసీ వ్యవహారంపై రాష్ట్రంలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎస్ఈసీ అంశంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల పట్ల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పందించారు.

తనను పూర్తికాలం పదవీలో కొనసాగేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు తన పదవీకాలం ఉందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ చర్యలు హైకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను ప్రభుత్వం అంగీకరించడంలేదని ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


More Telugu News