వందలాది గబ్బిలాలు మృతి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అలజడి
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- ఇటీవల బిహార్, యూపీల్లోనూ గబ్బిలాల మృతి
- ఆందోళన చెందుతోన్న ప్రజలు
- ఎండవేడికే అంటోన్న వైద్యులు
ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తోంటే, మరోవైపు వందలాది గబ్బిలాలు చచ్చిపోతుండడంతో మధ్యప్రదేశ్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గబ్బిలాలు ఎందుకు మృతి చెందుతున్నాయన్న విషయాన్ని గుర్తించేందుకు వాటి నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపిన వైద్యులు రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
కాగా, ఇటీవలే బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో 300 గబ్బిలాలు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఉత్తరప్రదేశ్‌లోనూ ఇటీవల దాదాపు 800కి పైగా గబ్బిలాలు చనిపోయాయి. అవి ఎండ వేడికే మృతి చెందాయని వైద్యుల నివేదికల ద్వారా తెలిసింది. చైనాలో కరోనా వ్యాప్తి గబ్బిలాల వల్లే జరిగిందని కొన్ని నెలల క్రితం కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.